శ్రీహరికోట, నవంబర్ 1: బాహుబలి వంటి అత్యంత ఎత్తయిన రాకెట్‌తో ఇస్రో ఆదివారం ఓ భారీ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధమవుతున్నది. ఆదివారం సాయంత్రం శ్రీహరి కోటలోని ప్రయోగ కేంద్రం నుంచి 4,410 కిలోల బరువున్న కమ్యూనికేషన్ శాటిలైట్ ‘సీఎంఎస్-03’ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతున్నది. ఇందుకోసం 43.5మీటర్ల ఎత్తున్న ‘ఎల్వీఎం3-5’ రాకెట్‌ను ఉపయోగిస్తున్నది. ఇంత బరువైన శాటిలైట్‌ను భారత్ నుంచి ప్రయోగించటం ఇదే మొదటిసారి. భారత భూభాగం సహా భూమిపై సముద్ర ప్రాంతాలకు సంబంధించి కీలక సమాచారాన్ని, బహుళ ప్రయోజనాలతో కూడిన వివిధ రకాల సేవల్ని ‘సీఎంఎస్-03’ అందించనున్నది.