న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం, ఇతర సంస్థలను బలహీనపరిచే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ 42 మంది రిటైర్డ్ జడ్జిల బృందం ఒక బహిరంగ లేఖ రాసింది. ఇటువంటి ప్రయత్నాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, బ్యాలెట్‌కు అర్థం పోయినప్పుడు అరాచకం ప్రబలుతుందని వారు వాదించారు. ఒక కట్టుకథతో అశాంతి మొదలవుతుంది. ఆ తర్వాత ఏర్పడిన శూన్యాన్ని అరాచక, విద్రోహ శక్తులు ఆక్రమిస్తాయి.
కొన్ని అంతర్గతంగా, కొన్ని సరిహద్దుల ఆవల నుంచి సూచనలు తీసుకుంటాయి అని సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు, ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారీ నిరసనలు చేస్తున్న నేపథ్యంలో వచ్చిన ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న అధికారులను పదేపదే ‘దొంగలు’, ‘రాజీపడిన వారి’గా ముద్ర వేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సర్ పక్రియను సమర్థిస్తూ అది ఓటర్ల జాబితాలను నిర్దిష్టంగా, లోపరహితంగా ఉంచే లక్ష్యంతో చేపట్టే చట్టబద్ధమైన ప్రక్రియ అని వారు పేర్కొన్నారు.