బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో నక్షత్ర తాబేళ్లను (Star Tortoise) అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 401 భారత నక్షత్ర తాబేళ్లను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని బెంగళూరు పోలీసులు ప్రకటించారు. ఇందులో 21 తాబేళ్లు మృతిచెందాయని, మరో 20 తాబేళ్ల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మొత్తంగా 380 తాబేళ్లు బతికి ఉన్నాయని చెప్పారు.
వాటిని బన్నేర్గట్ట నేషనల్ పార్కుకు తరలించామన్నారు. నిందితుడిపై వన్యప్రాణి సంరక్షణ యాక్ట్ కింద కేసు నమోదుచేశామని, తాంబేళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే విషయాన్ని తెలుసుకుంటున్నామని వెల్లడించారు.