లక్నో: పది లక్షలకుపైగా విలువైన 400 పావురాలు చోరీ అయ్యాయి. (Pigeons Stolen) దీంతో వాటిని పెంచి అమ్మే వ్యక్తి కంగుతిన్నాడు. ఖాళీగా ఉన్న పావురాల బోనులు చూసి షాకయ్యాడు. దొంగలు ఎలాంటి శబ్దం చేయకుండా వందల పావురాలను దొంగిలించడంపై ఆశ్చర్యపోయాడు. పోలీసులకు అతడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లిసాడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 20 ఏళ్లుగా ఇంటి మేడపై పావురాలు పెంచి వాటిని అమ్ముతున్నాడు.
సోమవారం ఉదయం ఆ యజమాని పావురాలకు మేత పెట్టేందుకు టెర్రస్‌పైకి వెళ్లాడు.
కాగా, అక్కడ ఏర్పాటు చేసిన బోనుల్లో ఉండాల్సిన సుమారు 400 పావురాలు మాయమయ్యాయి. ఇది చూసి ఆ వ్యక్తి షాకయ్యాడు. దొంగలు నిచ్చెన ద్వారా మేడపైకి చేరుకున్నట్లు గుర్తించాడు. అయితే ఎలాంటి శబ్దం రాకుండా పావురాలను చోరీ చేయడానికి దొంగలు ఎదైనా టెక్నిక్ ఉపయోగించారా? అని అనుమానం వ్యక్తం చేశాడు.
మరోవైపు సమారు పది లక్షలకుపైగా విలువైన 400 పావురాల చోరీపై వాటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, వందలాది పావురాల చోరీతో వాటిని ఉంచే బోనులు ఖాళీగా కనిపించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨 मेरठ ब्रेकिंग 🚨
मेरठ के लिसाड़ी गांव में एक चौकाने वाली चोरी की घटना सामने आई, जहां 400 कबूतर घर की छत से चोरी हो गए। कबूतर मालिक ने बताया कि उनकी कीमत 10 लाख रुपये से अधिक है।
चोर चाली बल्ली की सीडी बनाकर छत तक पहुंचे और कबूतरों की चोरी कर ली। जब कबूतर मालिक दाना डालने… pic.twitter.com/FV3HV1oVqw
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) February 17, 2025