AIMS | వైద్య రంగంపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌లలో 40 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీ
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్లల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్నది. 20 ఎయిమ్స్‌లలో 40 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే వైద్య రంగం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అర్థం చేసుకోవచ్చు.
- ఎయిమ్స్‌లలో భర్తీకి నోచని 40 శాతం ఫ్యాకల్టీ పోస్టులు
- కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తిన విపక్షాలు
AIMS | న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్లల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్నది. 20 ఎయిమ్స్‌లలో 40 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే వైద్య రంగం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ఎయిమ్స్‌లలో అధ్యాపక ఖాళీల గణాంకాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో మోదీ పాలనలో దేశ వైద్య, ఆరోగ్య వ్యవస్థకు జబ్బు చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌లలో 5,527 మంజూరు ఫ్యాకల్టీ పోస్టులు ఉండగా, వాటిల్లో 2,161 ఖాళీగా ఉన్నాయి.
దర్భంగ ఎయిమ్స్‌పై మోదీ పచ్చి అబద్ధాలు!
మరోవైపు, బీహార్‌లోని దర్భంగలో ఎయిమ్స్ నిర్మాణం విషయంపై ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రిపై బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. దర్భంగలో ఎయిమ్స్ నిర్మాణం కాకుండానే, ప్రారంభించామని మోదీ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పచ్చి అబద్ధాలు అడుతున్నారని పేర్కొన్నారు. ఎయిమ్స్‌ను ప్రారంభించామని ప్రధాని ఓ వైపు, నిర్మాణానికి భూమినే ఇంకా ఫైనల్ కాలేదంటూ కేంద్ర మంత్రి మరోవైపు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని తేజస్వీ ఎత్తిచూపారు.
అధ్యాపక పోస్టులు అత్యధికంగా ఖాళీగా ఉన్న ఎయిమ్స్ సంస్థలు
సంస్థ మంజూరైన ఖాళీలు
అధ్యాపకుల సంఖ్య
ఎయిమ్స్-ఢిల్లీ 1207 347
ఎయిమ్స్-కల్యాణి 259 151
ఎయిమ్స్-మదురై 183 141
ఎయిమ్స్-రాజ్‌పుర్ 305 115
ఎయిమ్స్-రాజ్‌కోట్ 183 111
ఎయిమ్స్-భోపాల్ 305 109
ఎయిమ్స్-గువాహటి 183 100
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- aiims
- Faculty posts
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

