న్యూఢిల్లీ, అక్టోబర్ 15: కేవలం 40 శాతం వైకల్యం ఒక వ్యక్తిని వైద్య విద్య చదవకుండా నిరోధించలేదని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ చదవడానికి అతడు అసమర్థుడని నిపుణులు నివేదిక ఇస్తే తప్ప, వైకల్యం అతడి చదువుకు అడ్డంకి కాదని తెలిపింది. ఓ వికలాంగుడు ఎలాంటి అడ్డంకి లేకుండా వైద్య విద్య అభ్యసించవచ్చని మెడికల్ బోర్డు అభిప్రాయపడిన తర్వాత, అతడు ఎంబీబీఎస్‌లో చేరడానికి సెప్టెంబర్ 18న సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. తాను ఇచ్చిన ఆదేశాలకు కోర్టు వివరంగా కారణాలను తెలిపింది. ఎంబీబీఎస్ చదవాలనుకొనే వికలాంగ అభ్యర్థి సామర్థ్యాన్ని వైకల్య మదింపు బోర్టు పరీక్షించాలని తెలిపింది.