Rescue Operation: 30 ఫీట్ల లోతులో చిక్కిన చిన్నారి.. బోర్వెల్ నుంచి నాలుగేళ్ల బాలుడిని రక్షించారు
Rescue Operation: నాలుగేళ్ల బాలుడు బోర్‌వెల్‌లో పడ్డాడు. అతన్ని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయి. ఈ ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జరిగింది.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పంజాబ్ పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సుమారు 9 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
చండీఘడ్: నాలుగేళ్ల బాలుడు బోర్‌వెల్‌లో పడ్డాడు. అతన్ని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయి. ఈ ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జరిగింది.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పంజాబ్ పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సుమారు 9 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) చేపట్టారు. పిల్లవాడిని గురుకరణ్ సింగ్‌గా గుర్తించారు. అతని పేరెంట్స్ హరిందర్, ఆశ. వాళ్లు కార్మికులు. శుక్రవారం రాత్రి 12.40 నిమిషాలకు పిల్లవాడిని బోర్వెల్ నుంచి బయటకు తీశారు. డీసీపీ ఆశికా జెయిన్, ఎస్పీ సందీప్ కుమార్ మాలిక్.. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహణను పర్యవేక్షించారు.
సాయంత్రం 4 గంటల సమయంలో పిల్లవాడు బోర్‌వెల్‌లో పడినట్లు జెయిన్ తెలిపారు. దీంతో అధికారులు ఆ స్పాట్‌కు చేరుకున్నారు. ఇంటి సమీపంలో ఉన్న బోర్‌వెల్‌లో పడినట్లు గుర్తించారు. ఒక్క రోజు ముందే ఆ బోర్వెల్ను తొవ్వినట్లు తెలుస్తోంది. అయితే ఆ వెల్‌కు సమాంతరంగా మరో గుంటను తొవ్వారని, సుమారు 30 ఫీట్ల లోతుకు ఆ పిట్‌ను తొవ్వినట్లు అధికారులు చెప్పారు.
దాదాపు 30 ఫీట్ల లోతులో గురుకరన్ చిక్కుకున్నట్లు రెస్క్యూ అధికారులు చెప్పారు. చిన్నారి కదలికలను గుర్తించేందుకు ఆ రంధ్రంలోకి ఓ కెమెరాను, ఆక్సిజన్ పైప్‌ను పంపారు. సుమారు 40 మంది ఎన్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

