మంగళవారం 31 మార్చి 2020
National - Mar 15, 2020 , 12:22:11

ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం

ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌: రాష్ట్రంలోని అనంతనాగ్‌ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు విట్రిగామ గ్రామంలో ఉన్నారన్న సమాచారంతో తెల్లవారుజామున బలగాలు కార్డెన్ సర్చ్ తనిఖీలు చేపట్టారు. ఒక ఇంటి నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.

హతమైన ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి మరో ముగ్గురు ఉగ్రవాదులు పరారయ్యారు. పారిపోయిన దుండగుల కోసం బలగాలు గాలిస్తున్నాయి. ఎవరైనా కొత్తవారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, కొత్తవారికి ఆశ్రయం కల్పించొద్దని బలగాలు మైక్‌లో అనౌన్స్‌ చేస్తున్నారు. మృతుల్లో అనంత్ నాగ్ జిల్లా హిజుబుల్ ముజాహిద్దీన్ కమాండర్ తరీఖ్ అహ్మద్ ఉన్నట్లు సమాచారం. 


logo
>>>>>>