శ్రీనగర్, జూలై 6: జమ్ము-కశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించగా, ఇద్దరు సైనికులు అమరులయ్యారు. జమ్ము-కశ్మీర్ కుల్గాం జిల్లాలో శనివారం ఈ రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు కుల్గాం జిల్లాలోని మోడర్గమ్ గ్రామంలో శనివారం భద్రతా దళాలు గాలింపు నిర్వహించాయి.
ఈ సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా దళాలు మధ్య కాల్పులు జరిగాయి. అలాగే ఓ ఇంట్లో లష్కరే గ్రూప్ ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో ఫ్రిసల్ చిన్నగం గ్రామంలో గాలింపు చేపట్టగా పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ రెండు ఎన్కౌంటర్లలో నలుగురు తీవ్రవాదులు మరణించగా, ఇద్దరు సైనికులు వీర మరణం పొందారు.