Lift Collapses | ఉత్తరప్రదేశ్‌లో (UP) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడా (Greater Noida)లో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలి (Lift Collapses ) నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌర్ సిటీ (Gaur City )లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్ట్‌లో నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో లిఫ్ట్ కూలడంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Nuh violence | నుహ్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
Private Jet Skids Off Runway | రన్‌వేపై జారిన విమానం.. 8 మందికి గాయాలు
Nipah virus | కేరళలో మరొకరికి నిఫా వైరస్.. 6కు పెరిగిన పాజిటివ్ కేసులు