బెంగళూరు : ఊబకాయంతో కనీసం ఊపిరి తీసుకోలేని వ్యక్తికి బెంగళూరు మణిపాల్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. 38 ఏండ్ల సుఖ్మిత్ సింగ్ 235 కిలోల బరువుతో కొన్నేండ్లుగా బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందితో పాటు కదల్లేక అవస్థలు పడ్డాడు.
ఆరుగురు వైద్య సిబ్బంది సుఖ్మిత్ సింగ్ను అంబులెన్స్ వరకు ఎత్తలేకపోయారు. దీంతో బాధితుడే పసి పిల్లాడిలా నేలపై పాకుతూ.. తలుపు వరకు చేరుకున్నాడు. బేరియాటిక్ సర్జన్ డాక్టర్ మొయినోద్దిన్ అత్యాధునిక వైద్య పరికరాల సాయంతో సుఖ్మిత్ పొత్తి కడుపు భాగంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించారు. 34 కిలోల బరువు తగ్గిన సుఖ్మిత్ ఆపరేషన్ జరిగిన సాయంత్రమే నడవగలిగినట్లు వైద్యులు పేర్కొన్నారు.