శ్రీనగర్ : 1990 ప్రారంభంలో జరిగిన కశ్మీరీ పండిట్లపై హింసాకాండ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ సమయంలో నర్సు సర్లా భట్ పై లైంగికదాడి చేసి చంపేసిన కేసులో 36 ఏండ్ల తర్వాత జమ్ము-కశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) సోమవారం 737 పేజీల చార్జ్‌షీట్‌ను టాడా కోర్టులో దాఖలు చేసింది.
జేకేఎల్ఎఫ్ చీఫ్ మొహమ్మద్ యాసిన్ మాలిక్‌ను ఈ ఘటనలో ప్రధాన సూత్రధారిగా చేర్చింది. సర్లాభట్ను చంపడం కేవలం ఉగ్రవాద చర్య మాత్రమే కాదని.. కశ్మీరీ పండిట్లలో భయాన్ని పెంచి లోయ నుంచి వెళ్లగొట్టే కు ట్రగా అధికారులు చార్జ్‌షీట్‌లో చే ర్చారు. యాసిన్ ఆధ్వర్యంలో ఐ దుగురు దుండగులు ఈ ఘాతు కా నికి పాల్పడ్డారని ఎస్ఐఏ చెప్పింది.