Lok Sabha | లోక్‌సభలో విపక్ష ఎంపీల నిరసన.. 34 మంది ఎంపీల సస్పెన్షన్..
Lok Sabha | లోక్‌సభ నుంచి 34 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సభలో గందరగోళం సృష్టించినందుకు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సహా 34 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ అయ్యారు.
Lok Sabha | లోక్‌సభ నుంచి 34 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సభలో గందరగోళం సృష్టించినందుకు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సహా 34 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ అయ్యారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగనున్నది. సస్పెండ్ అయిన ఎంపీల్లో అధిర్ రంజన్ చౌదరి, టీఆర్ బాలు, దయా నిధి మారన్ ఉన్నారు. మాణికం ఠాగూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకందన్, బెన్నీ బహనన్, కే సుబ్రమణ్యం, ఎస్ వెంకటేశన్, మహ్మద్ జావేద్ ఉన్నారు. 31 మంది ఎంపీలను శీతాకాల సమావేశాల వరకు సస్పెన్షన్ విధించగా.. మరో ముగ్గురిని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక ఇచ్చే వరకు సస్పెండ్ చేయగా.. కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ ముగ్గురు స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో ప్రవేశపెట్టారు.
ఇటీవల లోక్‌సభలోకి ఇద్దరు యువకులు చొరబడి కలర్ స్మోక్‌ను వదిలిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రధాని లేదంటే కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సైతం సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టాయి. ఈ క్రమంలో లోక్‌సభతో పాటు రాజ్యసభ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. భద్రతా వైఫల్యంపై రాజకీయం చేయడం శోచనీయమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. వెల్‌లోకి వచ్చి నినదించడం సభా మర్యాదలకు విరుద్ధమన్నారు. కీలకమైన అంశాలపై చర్చ చేపట్టేందుకు ప్రతిపక్షాల సహకారం అవసరమని ఓం బిర్లా అన్నారు. ఘటనపై విచారణ జరుగుతుందని.. దర్యాప్తు ఏజెన్సీలు ఆ వ్యవహారాన్ని తేలుస్తాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

