కోల్‌కతా: నేపాల్‌లో వచ్చిన ఆకస్మిక వరదల్లో(Nepal Floods) గల్లంతైనవారిలో పశ్చిమబెంగాల్‌కు చెందిన 32 మంది ఉన్నట్లు తెలిసింది. వారంతా ఓ గ్రూపుగా మానససరోవర యాత్రకు వెళ్లారు. అయితే వరదలు రావడానికి ముందు వరకు కాంటాక్టులో ఉన్న వారు.. ప్రస్తుతం ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. ఆ బృందంలో 30 మంది పర్యాటకులు, ఇద్దరు టూరు మేనేజర్లు ఉన్నారు. ఆగస్టు 21వ తేదీన ఆ గ్రూపు కోల్‌కతా నుంచి నేపాల్ బయలుదేరింది. 22వ తేదీన వారు నేపాల్ చేరుకున్నారు. అయితే బుధవారం ఆ గ్రూపు టిబెట్‌లో ప్రవేశించేందుకు రసువాగాధి చేరుకున్నారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆకస్మికంగా వరదలు వచ్చిన సమయంలో ఇమ్మిగ్రేషన్ ఆఫీసు వద్దే ఆ గ్రూపు ఉన్నట్లు తెలిసింది.
ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఆ 32 మందిలో ఒక్కరు కూడా టచ్‌లోకి రాలేదని అధికారులు చెప్పారు. టిబెట్-నేపాల్ బోర్డర్లో వచ్చిన వరదల వల్ల మృతుల సంఖ్య ప్రస్తుతం 157గా ఉంది. వందల సంఖ్యలో జనం గల్లంతు అయ్యారు. దీంట్లో భారతీయుల సంఖ్య 133గా ఉన్నట్లు భావిస్తున్నారు. బెంగాల్ యాత్రికుల మిస్సింగ్ పట్ల ఆ రాష్ట్ర సీఎం సువేందు అధికారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కోల్‌కతా గ్రూపు టూరుకు బయలుదేరింది.
వరద విలయం తర్వాత నేపాల్ టూరిజం, భారత ఎంబసీతో ఆ గ్రూపు టచ్‌లోకి వచ్చింది. కానీ ఎటువంటి సమాచారం అందలేదు. కాట్మాండులోని సమ్రాట్ ట్రావెల్ ఏజెన్సీ ఈ టూర్‌ను ఆర్గనైజ్ చేసింది. ఈ గ్రూపు ద్వారా వెళ్లిన టూరిస్టులు అంతా కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇద్దరు మేనేజర్లకు మొబైల్ రోమింగ్ సౌకర్యం ఉందని, కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ తర్వాత వారింకా టచ్‌లోకి రాలేదన్నారు.