Medical Student’s Ragging | వైద్య విద్యార్థిని ర్యాగింగ్ చేసిన సీనియర్లు.. 300 గుంజీలు తీయించడంతో కిడ్నీలో సమస్య
Medical Student's Ragging | మెడికల్ స్టూడెంట్ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. 300 గుంజీలు తీయించారు. దీంతో ఒక కిడ్నీలో సమస్య వచ్చింది.. ఈ విషయం తెలిసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏడుగురు సీనియర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జైపూర్: మెడికల్ స్టూడెంట్ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. (Medical Student’s Ragging) 300 గుంజీలు తీయించారు. దీంతో ఒక కిడ్నీలో సమస్య వచ్చింది. ఈ విషయం తెలిసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏడుగురు సీనియర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్‌లోని దుంగార్పూర్ మెడికల్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. మే 15న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని కొందరు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఏక ధాటిగా 300 గుంజీలు తీయించారు. దీంతో అతడి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో వారం రోజులు అడ్మిట్ అయ్యాడు. డాక్టర్లు నాలుగు సార్లు డయాలసిస్ చేశారు.
కాగా, ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆ విద్యార్థి ఈ నెలలో తిరిగి మెడికల్ కాలేజీకి వచ్చాడు. జూన్ 20న ఈ విషయం గురించి కాలేజీకి ఆన్లైన్లో ఫిర్యాదు అందింది. దీంతో యాంటీ ర్యాగింగ్ కమిటీతో విచారణ జరిపించారు. ఏడుగురు సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్ మంగళవారం ఏడుగురు నిందితులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

