Accident | దాబాలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు దుర్మరణం
ఉత్తప్రదేశ్‌లోని ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఇటావాలోని మానిక్‌పూర్ క్రాసింగ్ వద్ద జాతీయ రహదారి-2పై అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు పక్కనున్న దాబాలోకి దూసుకెళ్లింది.
లక్నో: ఉత్తప్రదేశ్‌లోని ఇటావాలో (Etawah)ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఇటావాలోని మానిక్‌పూర్ క్రాసింగ్ (Manikpur Crossing) వద్ద జాతీయ రహదారి-2పై అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు పక్కనున్న దాబాలోకి (Dhaba) దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
జార్ఖండ్ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రక్కు కాన్పూర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్నదని ఎస్ఎస్పీ సంజయ్ వర్మా (Sanjay Verma) చెప్పారు. డ్రైవర్‌ను అరెస్టు చేశామని, అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామన్నారు. జేసీబీ, క్రేన్ సహాయంతో ట్రక్కును అక్కడి నుంచి తొలగించామని తెలిపారు. గాయపడిన వారిపరిస్థితి విషమంగా ఉందన్నారు.


#WATCH | 3 dead and 3 injured after a dumper truck rammed into a Dhaba in Etawah, Uttar Pradesh (16/12) pic.twitter.com/kzAuQUIwwn
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 16, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

