పాట్నా: బీహార్లోని ఎన్ఐటీ పాట్నా(NIT Patna)లో బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. శనివారం తెల్లవారుజామున ఆమె మృతిచెందింది. కాలేజీ క్యాంపస్లో విద్యార్థిని మృతిని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్లోని ఆనంద్పురాలో ఆమె నివాసం ఉన్నది. బీటా పోలీసు స్టేషన్ ఏరియాలో ఉన్న సికందర్పుర్లో ఉన్న మహిళా క్యాంపస్ హాస్టల్లో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఆ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదో ఇంకా తెలియరాలేదు.
బీటా క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్యను నిరసిస్తూ.. బీటాతో పాటు పాట్నా ఎన్ఐటీలో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వీధుల్లోకి వెళ్లిన విద్యార్థులు రభస సృష్టించారు. చేతుల్లో ప్లకార్డులను పట్టుకుని, నినాదాలు చేశారు. కాలేజీ యాజమాన్యంకు వ్యతిరేకంగా పోరాడారు. నిర్మాణంలో ఉన్న క్యాంపస్ హాస్టల్కు విద్యార్థులను షిఫ్ట్ చేశారని, అక్కడ కావాల్సినన్ని సౌకర్యాలులేకున్నా.. వాళ్లను ఆ హాస్టిల్కు పంపినట్లు తెలిసింది.