న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రస్తుతం రష్యా సైనిక దళంలో 27 మంది భారతీయులు పనిచేస్తున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయంలో తాము ఆ 27 మంది బాధిత కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
రష్యా ఆర్మీలోకి భారతీయ పౌరులను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని మరోసారి కోరుతున్నామని, దీని వల్ల వారి జీవితం, ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న క్రమంలో కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలు భారత దేశంలోని నిరుద్యోగులను మభ్యపెట్టి రష్యా సైన్యంలో చేర్చాయని ఆయన చెప్పారు.