ముంబై: రద్దీగా ఉన్న బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. ఆమె వెళ్లే బస్సు అక్కడ ఉందని ఒక వ్యక్తి నమ్మించాడు. ఎవరూలేని బస్సులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. (Woman Raped In Bus) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఔంధ్ బనేర్ ప్రాంతంలో నివసించే 26 ఏళ్ల మహిళ ఒక ఆసుపత్రిలో కౌన్సెలర్‌గా పనిచేస్తున్నది. ఫిబ్రవరి 25న ఉదయం 6 గంటల సమయంలో స్వర్గేట్ బస్టాండ్‌కు చేరుకున్నది. ఫల్తాన్‌కు వెళ్లే బస్సు కోసం ఒక ప్లాట్‌ఫామ్ వద్ద వేచి ఉన్నది.
కాగా, ఒక వ్యక్తి ఆ మహిళ వద్దకు వచ్చాడు. ఆమె ఎక్కాల్సిన బస్సు మరో ప్లాట్‌ఫామ్ వద్దకు వచ్చిందని చెప్పాడు. నమ్మిన ఆ మహిళ అతడి వెంట వెళ్లింది. ఎవరూలేని చోట చీకటి ప్రదేశంలో పార్క్ చేసిన శివషాహి బస్సు వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. ప్రయాణికులు ఎవరూ లేరని ఆమె ప్రశ్నించగా బస్సు లోపల కూర్చొన్నారని అతడు చెప్పాడు. ఆ మహిళ బస్సులోకి ప్రవేశించగానే లోపలి నుంచి డోర్ లాక్ చేశాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ భయపడింది. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. ఆమె సహాయంతో స్వర్గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని దత్తాత్రాయ్ రామ్‌దాస్ గడేగా గుర్తించారు. శిక్రపూర్, శిరూర్ పోలీస్ స్టేషన్లలో అతడిపై దొంగతనం కేసులున్నాయని పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు 8 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
#WATCH | #Pune: 26-Year-Old Woman Rap*d Inside Shiv Shahi Bus At Swargate Bus Stand; City Police Seals Bus Door
Read the story by @AnkitShukla5454 on The Free Press Journal: https://t.co/UG2qAPfdoM#punenews #maharashtra #swargate pic.twitter.com/ju0uvPTN9S
— Free Press Journal (@fpjindia) February 26, 2025