Rafale Marine Jets | 63 వేలకోట్ల రూపాయలతో 26 రాఫెల్ మెరైన్ జెట్లు.. ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం
ఫ్రాన్స్ నుంచి 26 అత్యాధునిక రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సోమవారం సంతకాలు చేశాయి.
Rafale Marine Jets | న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి 26 అత్యాధునిక రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సోమవారం సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, నావికా దళం వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ కే స్వామినాథన్ పాల్గొన్నారు. ఈ విమానాల కొనుగోలుకు ఈ నెల 9న భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కాంట్రాక్టులో భాగంగా సింగిల్ సీటర్ విమానాలు 22, ట్విన్ సీటర్ విమానాలు నాలుగు మన దేశానికి వస్తాయి.
లాజిస్టికల్ సపోర్ట్, భారత నావికా దళ సిబ్బందికి శిక్షణ, మన దేశంలోనే విడిభాగాల తయారీ వంటివి కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ విమానాల రాక 2029 చివరి నుంచి ప్రారంభమై, 2031 నాటికి పూర్తవుతుంది. అత్యాధునిక రాఫెల్-ఎం యుద్ధ విమానాల రాకతో సముద్రాలపై యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు మన దేశానికి మరింత పెరుగుతాయి. హిందూ మహా సముద్రంలో ముప్పును ఎదుర్కొనే సత్తా కూడా పెరుగుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

