26/11 Attacks | భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 26/11 ముంబై దాడులు జరిగి నేటితో పదమూడేళ్లు అవుతోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు అప్పటి డీఐజీ ఏటీఎస్గా ఉన్న పరమ్ బీర్ సింగ్ సహకరించాడని ఒక మాజీ అధికారి ఆరోపించారు. ప్రస్తుతం పరమ్ బీర్ సింగ్.. బలవంతపు వసూళ్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
26/11 దాడులు జరిగిన సమయంలో ఆయన డీఐజీ ఏటీఎస్గా ఉన్నారు. దాడుల తర్వాత ఉగ్రవాది కసబ్ అరెస్టయినప్పుడు అతని దగ్గర మొబైల్ ఫోన్ ఉందని, దాన్ని పరమ్ బీర్ సింగ్ స్వాధీనం చేసుకున్నాడని విశ్రాంత ఏసీపీ షంషేర్ ఖాన్ పఠాన్ ఆరోపించారు. ఇదే విషయాన్ని వివరిస్తూ ఈ ఏడాది జూలైలో మహారాష్ట్ర పోలీసు కమిషనర్‌కు కూడా ఆయన లేఖ రాశారు.
‘కేసు విచారణలో మళ్లీ ఆ మొబైల్ కనిపించకూడదనే ఆలోచనతోనే కసబ్ మొబైల్‌ను పరమ్ బీర్ తీసుకున్నాడు’ అని షంషేర్ ఖాన్ చెప్పారు. పరమ్ బీర్‌ను ఎన్ఐఏ అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా సేకరించిన సమాచారాన్ని ఐఎస్ఐఎస్కు అమ్మేసి ఉండొచ్చని, లేదంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించడానికి ఉపయోగించి ఉండొచ్చని షంషేర్ అన్నారు.
I wrote a letter regarding this in July this year. He (Param Bir Singh) should be arrested by NIA for the destruction of evidence. He must have sold this recovered evidence to ISIS or may have used the information for extortion: Retired ACP Shamsher Khan Pathan pic.twitter.com/pVKCQqVbXT
— ANI (@ANI) November 26, 2021