న్యూఢిల్లీ: తనను భారత్కు అప్పగించడంపై అత్యవసరంగా స్టే విధించాలని 2008 ముంబై ఉగ్ర దాడుల నిందితుడు తహవుర్ రాణా అమెరికా సుప్రీంకోర్టును కోరాడు. తన జాతి, మత, సామాజిక గుర్తింపు కారణంగా భారతదేశంలో తనను చిత్రహింసలు పెట్టి చంపేస్తారంటూ అతను తన పిటిషన్లో ఆరోపించాడు.
తాను పాకిస్థానీ సంతతికి చెందిన ముస్లింనని, తాను పాకిస్థానీ సైన్యానికి చెందిన మాజీ సభ్యుడినని అతను తెలిపాడు. ఈ కారణంగానే కస్టడీలో తనను చిత్రహింసలు పెడతారని అనుమానించవలసి వస్తోందని, తనను ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టవద్దని కోర్టును అభ్యర్థించాడు.