బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 14:38:46

మ‌రో 236 మంది పోలీసుల‌కు క‌రోనా

మ‌రో 236 మంది పోలీసుల‌కు క‌రోనా

ముంబై: మ‌హారాష్ట్రలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ప్ర‌తిరోజూ వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌హారాష్ట్ర పోలీస్ విభాగంలో కూడా ప్ర‌తిరోజు వంద‌ల్లో కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి బుధ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 236 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మ‌హారాష్ట్ర పోలీసుల‌లో క‌రోనా బారిన‌ప‌డిన వారి సంఖ్య‌ 8,958కి చేరింది. 

అందులో 6,962 మంది పోలీసులు ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 1898 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, బుధ‌వారం క‌రోనా సోకిన మ‌రో పోలీస్ మ‌ర‌ణించ‌డంతో మ‌హారాష్ట్ర పోలీస్ విభాగంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 98కి చేరింది. మ‌హారాష్ట్ర పోలీస్ డిపార్టుమెంట్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.                       

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo