న్యూఢిల్లీ: ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ (Jawed Habib), అతని కుటుంబ సభ్యులపై కోట్లాది రూపాయల క్రిప్టో కరెన్సీ మోసం కేసు నమోదైంది. 100 మందికిపైగా కోట్లాది రూపాయలను మోసం చేసినందుకు సంభాల్(యూపీ)లో పోలీసులు జావెద్ హబీబ్, తండ్రి హబీబ్ అహ్మద్, కుమారుడు అనోష్ హబీబ్లకు వ్యతిరేకంగా 20 కేసులు నమోదుచేశారు.
పరారీలో ఉన్న జావెద్ హబీబ్, అనోష్లపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులతో భారీ లాభాలు వస్తాయంటూ 150 మందితో డబ్బులు కట్టించుకున్న కంపెనీ జావెద్ హబీబ్దేనని తేలింది.