న్యూఢిల్లీ : ఢిల్లీలోని అమర్ కాలనీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కూతురు (22) బుధవారం హత్యకు గురైందని పోలీసులు బుధవారం తెలిపారు. గతంలో ఆ అధికారి ఇంట్లో పనిచేసిన యువకుడు (19) ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం ఐఆర్ఎస్ అధికారి, ఆయన భార్య జిమ్‌కు వెళ్లారు.
వారు తిరిగి వచ్చే సరికి వారి కుమార్తె విగత జీవిగా కనిపించింది. ఆమె గొంతుకు ఫోన్ చార్జ్ కేబుల్ బిగించి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితుడిని నెల క్రితమే పనిలో నుంచి తొలగించారు. ఘటనకు ముందు అతడు ఇంటి పరిసరాల్లో తిరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఇంట్లోకి చొరబడి లైంగిక దాడి, హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.