కొత్తగూడెం ప్రగతి మైదాన్, అక్టోబర్ 26: ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు, 18 ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో 13 మంది మహిళా సభ్యులు, డీవీసీఎం కార్యదర్శి ముఖేష్ ఉన్నారు.
వీరంతా నార్త్ సబ్ జోనల్ బ్యూ రో పరిధిలోని కుమారి, కిస్కొడా ఏరియా కమిటీల్లో చురుకుగా పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులుగా పోలీస్ అధికారులు వెల్లడించారు.