బట్టలు ఊడదీసి.. తలకిందులుగా వేలాడదీసి!
వారంతా ఏ దిక్కూ లేని పిల్లలు. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని ఓ అనాథాశ్రమంలో ఉంటున్నారు. అలాంటి వారిని తల్లిదండ్రులు లేని లోటు కనిపించకుండా చూసుకోవాల్సిన ఆశ్రమ సిబ్బందే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
- అనాథ పిల్లలపై ఆశ్రమ సిబ్బంది క్రూరమైన అకృత్యాలు
- చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల ముందు వాపోయిన పిల్లలు
- మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని ఓ అనాథాశ్రమంలో ఘటన
ఇండోర్: వారంతా ఏ దిక్కూ లేని పిల్లలు. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని ఓ అనాథాశ్రమంలో ఉంటున్నారు. అలాంటి వారిని తల్లిదండ్రులు లేని లోటు కనిపించకుండా చూసుకోవాల్సిన ఆశ్రమ సిబ్బందే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చిన్న తప్పులకే చిత్రహింసలు పెడుతూ దారుణంగా వ్యవహరిస్తున్నారని బాధిత చిన్నారులు వాపోతున్నారు. బట్టలు ఊడదీయడం, నగ్నంగా ఫొటోలు తీయడం, తలకిందులుగా వేలాడదీయడం, వాతలు పెట్టడం, మిర్చిని కాల్చడం ద్వారా వచ్చే పొగను బలవంతంగా పీల్చేలా చేయడం వంటివి చేస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆశ్రమ సిబ్బంది పలు విధాలుగా హింస పెడుతున్నారని గత వారం ఆకస్మిక తనిఖీలకు వచ్చిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) ముందు 21 మంది చిన్నారులు వాపోయారని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఈ భయానక హింసకు సంబంధించి ఐదుగురు ఆశ్రమ సిబ్బందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ప్యాంటులో మలవిసర్జన చేశాడన్న కారణంతో ఒక నాలుగేండ్లు విద్యార్థిని బాత్రూమ్లో నిర్బంధించి, 2-3 రోజుల పాటు ఆహారం కూడా పెట్టలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆశ్రమాన్ని సీల్ చేశామని, పిల్లలను ప్రభుత్వ కేంద్రాలకు తరలించామని ఇండోర్ ఏసీపీ అమరేంద్ర సింగ్ తెలిపారు. వాత్సల్యపురం జైన్ ట్రస్టు నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నమోదు కాలేదని, ఈ ట్రస్టుకు బెంగళూరు, సూరత్, జోధ్‌పూర్, కోల్‌కతాలో కూడా ఆశ్రమాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఇండోర్ ఆశ్రమంలో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెం దిన చిన్నారులు ఉన్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

