న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ 2025 పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్ 2బీ(బీ ప్లానింగ్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. ఏప్రిల్ సెషన్లో పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్లు, అఖిల భారత ర్యాంకులను జేఈఈ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు.
పేపర్ 2ఏ(బీఆర్క్)లో ఎన్టీఏ స్కోర్ 100ని ప్రథం అల్పేష్ ప్రజాపతి, పాట్నే నీల్ సందేశ్ సాధించగా పేపర్ 2బీ(బీ ప్లానింగ్)లో 100 స్కోరును గౌరమ్ , తరుణ్, సునిధి సింగ్ సాధించి టాపర్లుగా నిలిచారు.