Umar Khalid | తల్లికి సేవ చేసేందుకు బెయిల్ కావాలన్న ఉమర్ ఖలీద్.. నిరాకరించిన కోర్టు
Umar Khalid : ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కు కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించింది. ఉమర్ ఖలీద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
Umar Khalid : ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కు కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించింది. తన తల్లిని సంరక్షించుకునేందుకు, అలాగే, మరో కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఉమర్ ఖలీద్ ఇటీవల ఢిల్లీలోని కార్కర్డూమా కోర్టును ఆశ్రయించాడు. దీనిపై అదనపు జడ్జి సమీర్ బాజ్‌పాయ్ విచారణ జరిపారు. ఉమర్ ఖలీద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
బెయిల్ తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఉమర్ ఖలీద్ తల్లికి జూన్ 2న శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంది. దీంతో ఆమెకు కొద్ది రోజులు తోడుగా ఉండాలని ఉమర్ ఖలీద్ కోర్టును కోరాడు. అలాతే, తమ బంధువు మరణించినందున దానికి సంబంధించిన కార్యక్రమానికి కూడా మతపరంగా హాజరుకావాల్సి ఉందని కోర్టుకు తెలిపాడు. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని దరఖాస్తులో కోరాడు. కానీ, కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఉమర్ ఖలీద్‌కు గతంలో ఇలాంటి కార్యక్రమానికి హాజరయ్యేందుకు కోర్టు బెయిల్ ఇచ్చిందని, అలాగే, అతడు కూడా బెయిల్ నిబంధనల్ని పాటించాడని కోర్టు తెలిపింది.
అంతమాత్రాన ప్రతి సందర్భంలో బెయిల్ ఇవ్వలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి బెయిల్ దరఖాస్తును ప్రత్యేకంగా చూస్తామని, వాస్తవాల్ని, అవసరాల్ని పరిశీలిస్తామని చెప్పింది. ఉమర్ తల్లిని చూసుకునేందుకు అతడి సోదరి, తండ్రి అందుబాటులో ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఉమర్ ఖలీద్ కేసుకు సంబంధించి గతంలోనే సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ అంశంపై సోమవారం కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా అతడికి బెయిల్ నిరాకరించేందుకు అనేక కారణాలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. బెయిల్ అనేది ఒక రూల్ అని, జైలు అందుకు మినహాయింపు అని కోర్టు తెలిపింది.
2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసులో జేఎన్టీయూ విద్యార్థి అయిన ఉమర్ ఖలీద్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అప్పట్లో సీఏఏ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో అతడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై యూఏపీఏ సహా వివిధ చట్టాలపై కేసులు నమోదయ్యాయి. అతడు 2020 నుంచి జైలులోనే ఉన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

