శుక్రవారం 10 జూలై 2020
National - Jun 21, 2020 , 15:12:32

పండుగ సీజన్ లో కొత్త కార్ల కొనుగోళ్లు పెరుగుతాయి : మెర్సిడెస్ బెంజ్ ఎండి

పండుగ సీజన్ లో కొత్త కార్ల కొనుగోళ్లు పెరుగుతాయి : మెర్సిడెస్ బెంజ్ ఎండి

ముంబై : దేశ వ్యాప్తంగా కొత్త కార్లకన్నాసెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాల జోరే కొనసాగుతుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండి అండ్ సిఇవో మార్టిన్ ష్వెంక్ తెలిపారు. లాక్ డౌన్ ప్రభావం ఆటోమొబైల్ రంగం పై తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పట్లో కొత్త కార్లు కొనుగోళ్లు ఉండక పోవచ్చని,  వీటికి ప్రత్యామ్నాయంగా భారతదేశంలో వాడిన కార్ల వ్యాపారం బలంగా ఉంటుందని ష్వెంక్ చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కొనుగోలుదారులు షోరూమ్ లకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందుకోసమే ఆన్‌లైన్ అమ్మకాల ను ప్రవేశపెట్టామని ఆయన పేర్కొన్నారు. కొత్తకార్ల కంటే సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు పెరుగుతాయని ఆయన అంటున్నారు. దీని ప్రభావం కొత్త కార్లు కొనాలనుకునేవారిపై ఉండదని ష్వెంక్ చెబుతున్నారు. ఈ ఏడాది పండుగ సీజన్ లో కొత్త కార్ల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. 


logo