శుక్రవారం 05 జూన్ 2020
National - May 13, 2020 , 06:38:18

ఈ వేసవి అసాధారణం!

ఈ వేసవి అసాధారణం!

  • హీట్‌జోన్లలోనూ లేని వడగాడ్పులు
  • మార్చి 1 నుంచి మే 11 మధ్య అధిక వర్షపాతం

న్యూఢిల్లీ : ఈ వేసవిలో ఎప్పడూ లేనటువంటి అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎండలు మండే ప్రాంతాల్లోనూ ఈసారి పెద్దగా వడగాడ్పులు లేవని, మరోవైపు దేశవ్యాప్తంగా అత్యధిక వర్షాలు నమోదయ్యాయని పేర్కొంటున్నారు. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలోని హీట్‌వేవ్‌ జోన్లలో మార్చితో ఎండలు మొదలై, ఏప్రిల్‌, మేలో తీవ్రమవుతాయి. నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే జూన్‌ మొదటి వారం వరకూ ఇవి కొనసాగుతాయి. ఉత్తర, తూర్పు మైదాన ప్రాంతాలు, విదర్భ-మరాఠ్వాడా, గుజరాత్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలను హీట్‌వేవ్‌ జోన్లుగా పరిగణిస్తారు. పశ్చిమ రాజస్థాన్‌లో 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుంటాయి.

ఈసారి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావొచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనావేసింది. అయితే, ఇప్పటికీ ఆ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకాలేదు. అందుకు బదులుగా.. మార్చి 1నుంచి మే 11 మధ్యకాలంలో 25 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఐఎండీకి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త ఓపీ శ్రీజిత్‌ మాట్లాడుతూ.. మార్చి నెలలో సాధారణం కంటే 47 శాతం అధికంగా, ఏప్రిల్‌లో 8 శాతం ఎక్కువగా వర్షపాతం రికార్డయిందని వెల్లడించారు. ఇది సాధారణ విషయం కాదని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. 


logo