అలప్పుజ: కేరళలో ఏవియన్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతున్నది. అలప్పుజ జిల్లాలో బాతులకు ఏవియన్ ఫ్లూ వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. హరిపాద్ మున్సిపాలిటీలోని వఝూతానం వార్డులో బాతులు అకస్మాత్తుగా మృత్యువాతపడ్డాయి.
అనుమానంతో అధికారులు నమూనాలను పరీక్షలకు పంపించారు. భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ఆ బాతులకు ఏవియన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆ ఫాంలకు కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతులన్నింటినీ చంపాలని కేరళ సర్కారు నిర్ణయించింది. పది మందితో కూడిన ఎనిమిది ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు 20,471 బాతులను చంపేయనున్నాయి.