Varanasi: వారణాసిలో 200 ఏళ్ల క్రితం నాటి మసీదు కూల్చివేత.. వీడియో
Varanasi: సుమారు 200 ఏళ్ల క్రితం నాటి మసీదును వారణాసిలో కూల్చివేశారు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఆ మసీదును ధ్వంసం చేశారు. అయితే కాశీ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ కోసం భూమిని క్లియర్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆ ప్రాంతంలో ఉన్న మసీదును కూల్చేశారు.
యూపీ: సుమారు 200 ఏళ్ల క్రితం నాటి మసీదును వారణాసి(Varanasi)లో కూల్చివేశారు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఆ మసీదును ధ్వంసం చేశారు. అయితే కాశీ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ కోసం భూమిని క్లియర్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆ ప్రాంతంలో ఉన్న మసీదును కూల్చేశారు. రాజ్ఘాట్ సమీపంలోని అజ్గబీ షహీద్ మసీదు… రైల్వే ప్రాజెక్టు డిజైన్ ఏరియాలోనే ఉన్నది. అయితే భారీ భద్రత మధ్య ఆ మసీదును తొగించారు. స్టేషన్ ఆధునీకరణ కోసం మార్క్ చేసిన ప్రాంతంలో ఆ మసీదు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు 400 కోట్ల ఖర్చుతో కాశీ రైల్వే స్టేషన్ను పునర్ నిర్మించనున్నారు. రైలు, రోడ్డు, మెట్రో, వాటర్ ట్రాన్స్పోర్టు నెట్వర్క్ను సింగిల్ లొకేషన్లో కలపాలని కొత్త ప్లాన్ ద్వారా యోచిస్తున్నారు. మసీదు కూల్చివేతను చాలా తక్కువ టైంలో పూర్తి చేశారు. బుల్డోజర్ల ద్వారా మసీదు కట్టడాన్ని కూల్చేశారు. జాయింట్ పోలీసు కమీషనర్ శివ్ హరి మీనా సమక్షంలో కూల్చివేత జరిగింది. అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీసు, పారామిలిటరీ సిబ్బంది కూడా ఉన్నారు. అయిదు జేసీబీ మెషిన్లు, రెండు పోక్లాండ్ ఎక్స్కవేటర్లు వాడారు.
Varanasi, Uttar Pradesh: A mosque built on railway land was demolished late at night as part of work linked to the redevelopment of Kashi Railway Station. pic.twitter.com/ZV0r1ybqy3
— IANS (@ians_india) June 3, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

