Train Derail | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని బిలాస్పూర్ రైల్వే డివిజన్లో (Bilaspur Railway Division) బొగ్గు లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది (Train Derail). మంగళవారం ఉదయం 11:11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
బొగ్గు లోడ్‌తో కూడిన గూడ్స్ రైలు (Coal-Laden Goods Train) బిలాస్పూర్ నుంచి కట్నీకి వెళ్తోంది. ఈ క్రమంలో ఖోంగ్‌సార్ మధ్య రైలు పట్టాలు తప్పింది. ఏకంగా రైలులోని 20 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాక్‌ను క్లియర్ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనులు మొదలు పెట్టారు. రైలు పట్టాలు తప్పడానికి గల ఖచ్చితమైన కారణాలు విచారణ తర్వాత తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో నడిచే పూరీ యోగ్నాగ్రి రిషికేష్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్, దుర్గ్ – ఎంసీటీఎమ్ (ఉధంపూర్) ఎక్స్‌ప్రెస్ సహా పలు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Sanjay Raut | మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఆయనే : సంజయ్ రౌత్
Rajya Sabha | ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
Mumbai Terror Attack | 26/11 ముంబై మారణహోమానికి 16 ఏళ్లు