ముంబై, ఆగస్టు 1: మహారాష్ట్రలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. థాణె జిల్లాలో కొనసాగుతున్న సమ్రుద్ధి ఎక్స్ప్రెస్వే పనుల్లో అపశృతి చోటుచేసుకున్నది. దాదాపు 35 మీటర్ల ఎత్తు నుంచి గిర్డర్ లాంచర్ (భారీ ఇనుప సామగ్రి) కుప్పకూలింది. దీంతో 20 మంది మరణించారు. వీరిలో 10 మంది కూలీలు ఉన్నారు. ముగ్గురికి గాయాలయ్యాయి. నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు ఇద్దరు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు.