అమృత్సర్: 20 మంది భారత మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. దీంతో వారు సోమవారం రాత్రి పంజాబ్లోని అట్టారీ-వాఘా సరిహద్దు మీదుగా భారత్లోకి ప్రవేశించారు. పాక్ నేవీ సిబ్బంది తమను సముద్రంలో పట్టుకుని లాంధీ జైల్లో ఉంచారని భారత జాలర్లు ఆరోపించారు. తాము నాలుగేండ్లుగా ఆ జైలులో మగ్గినట్లు చెప్పారు. తమ విడుదలకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి మత్స్యకారులు కృతజ్ఞతలు చెప్పారు. పాకిస్థాన్ జైలులో ఉన్నప్పుడు తమ కుటుంబాలకు రూ.9000 అందించిన మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.