న్యూఢిల్లీ : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారైన భారత్ దిగమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎల్పీజీలో 20 శాతం డైమిథల్ ఈథర్ (డీఎంఈ)ని కలపడం ద్వారా ప్రతి ఏడాది 6.3 మిలియన్ టన్నుల గ్యాస్ దిగుమతులను తగ్గించాలని కేంద్రం అంచనా వేస్తున్నది. దీని ద్వారా రూ.34,200 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయి.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్) నిర్వచనం ప్రకారం డీఎంఈ అంటే పర్యావరణ అనుకూల, సుస్థిరమైన ఇంధ నం. దీనిని కృత్రిమంగా ఉత్పత్తి చేస్తారు. డీఎంఈ ఎల్పీజీకి పాక్షిక ప్రత్యామ్నాయమని నిపుణులు అంటున్నారు. భారత్లో ఇది పరిమితంగా ఉత్పత్తి అవుతున్నది.