ఇంఫాల్: హింస, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్‌లో దారుణం (Manipur Horror) జరిగింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు గిరిజన సంఘం ఆరోపించింది. రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 4న ఈ హేయమైన సంఘటన జరిగినట్లు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐటీఎల్ఎఫ్) ఆరోపించింది. ఈ సంఘటనకు ముందు లోయ ప్రాంతంలోని మెజార్టీ వర్గమైన మైతీ, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ వర్గం మధ్య ఘర్షణలు చెలరేగాయి.
కాగా, మే 4న జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మణిపూర్ పోలీసులు ఈ సంఘటనపై ఇంకా స్పందించలేదు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. అలాగే ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
మరోవైపు, మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం రెండు నెలల కిందట ఎస్టీ స్టేటస్ కోసం డిమాండ్ చేస్తున్న మైతీ వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కుకీ వర్గం దీనిని వ్యతిరేకించడంతో నాటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ హింసలో వందలాది మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.