కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూన్ 26: భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీకి చెందిన పెద్ద క్యాడర్ నాయకుడు అబూజ్మడ్ అడవుల్లో సంచరిస్తున్నట్లు పోలీసు అధికారులకు సమాచారం అందింది.
దీంతో నారాయణ్‌పూర్-కొండగావ్ జిల్లాలకు చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్స్, భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు.