ముంబై: టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో రెండు పులుల మధ్య భీకర పోరు జరిగింది. (Tigresses’ Fierce Fight) వాటి గర్జనలతో ఆ అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఇది చూసి సఫారీ పర్యాటకులు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడున్న పులులు వీర, భేల మధ్య భీకర ఫైట్ జరిగింది. నివాస ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఆ పులులు కొట్లాడుకున్నట్లు తెలుస్తున్నది.
కాగా, పులుల భీకర ఫైట్ చూసి సఫారీకి వెళ్లిన పర్యాటకులు భయాందోళన చెందారు. దీనిని చాలా సేపు తిలకించారు. జాగ్రత్త కోసం ఒక సఫారీ వాహనాన్ని దూరంగా మళ్లించారు. కొందరు పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశారు. మహారాష్ట్ర అటవీ శాఖ ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో పులుల భీకర ఫైట్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.