RBI | 2019 నుంచే రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేత..! 107 రెట్లు పెరిగిన నకిలీ నోట్లు
RBI | దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటును మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? చాలా కాలం నుంచి ఆ నోట్లు కనిపించడం లేదు కదా? 2019 సంవత్సరం నుంచి రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసింది ఆర్బీఐ.
RBI | రూ. 2 వేల నోట్ల చలామణిని ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే రూ. 2 వేల నోట్లు చెల్లుబాటులో ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. వినియోగదారులకు రూ. 2 వేల నోట్లు ఇవ్వొద్దని, తక్షణమే ఆపేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఇక ఈ నెల 23 నుంచి రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చని సూచించింది.
అయితే దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటును మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? చాలా కాలం నుంచి ఆ నోట్లు కనిపించడం లేదు కదా? 2019 సంవత్సరం నుంచి రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసింది ఆర్బీఐ. సమాచార హక్కు (ఆర్టీఐ) ద్వారా ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన జవాబు ఇదే. 2016 నవంబర్ 8న నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం విదితమే. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో ఆ నోట్ల వాటా 80 శాతానికి పైగానే ఉన్నది.
రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆధ్వర్యంలోని కరెన్సీ ముద్రణాలయాలు నిర్విరామంగా పనిచేసినా అంత భారీ స్థాయిలో కరెన్సీని త్వరగా ముద్రించడం కష్టమే. దీంతో రూ.2 వేల నోట్ల ముద్రణను మొదలుపెట్టిన ఆర్బీఐ.. క్రమంగా ఆ నోట్ల ప్రింటింగ్‌ను తగ్గించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 35,429.91 కోట్ల రూ.2 వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్.. 2017-18లో 1,115.7 కోట్ల నోట్లను, 2018-19లో కేవలం 466.90 కోట్ల నోట్లను ముద్రించింది. ఆ తర్వాత 2019 నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది.
107 రెట్లు పెరిగిన నకిలీ నోట్లు
2015లో రిజర్వు బ్యాంకు మహాత్మా గాంధీ సిరీస్-2005లో కొత్త నంబరింగ్ సిస్టంతో కూడిన అన్ని డినామినేషన్ల నూతన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీటిలోని సెక్యూరిటీ ఫీచర్లు చాలా స్పష్టంగా కనిపించేవి. దీంతో అసలు నోట్లకు, నకిలీ నోట్లకు మధ్య ఉన్న తేడాలను సాధారణ ప్రజలు సైతం సులభంగా గుర్తించగలిగేవారు. కానీ, పెద్ద నోట్లను రద్దుచేసి రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత నకిలీ నోట్ల చలామణి ఏకంగా 107 రెట్లు పెరిగింది. 2016లో దేశవ్యాప్తంగా 2,272 నకిలీ రూ.2 వేల నోట్లు పట్టుబడ్డాయని, 2020లో వీటి సంఖ్య ఏకంగా దాదాపు 2.45 లక్షలకు చేరినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

