Helicopter Crash: పుణెలో కూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలెట్లు మృతి
Helicopter Crash: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో హెలికాప్టర్ కూలింది. ఆ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, ఓ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయారు.
పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో హెలికాప్టర్ కూలింది(Helicopter Crash). ఆ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, ఓ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని హెరిటేజ్ ఏవియేషన్ ప్రైవేటు సంస్థకు చెందిన హెలికాప్టర్ అది. ఆక్స్ఫర్డ్ కౌంటీ గోల్ఫ్ కోర్సులోని హెలిప్యాడ్ నుంచి ఎగిరిన హెలికాప్టర్.. ముంబైలోని జూహుకు వెళ్తున్న సమయంలో కూలింది. ఇవాళ ఉదయం 7.40 నిమిషాలకు భవదాన్ ఏరియాలో ఉన్న కొండ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆగస్టా హెలికాప్టర్ కూలిన సమయంలో భారీ మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో మృతిచెందిన వారిని గిరీశ్ కుమార్, ప్రీతమ్ సింగ్ భరద్వాజ్, పరంజీత్ సింగ్‌గా గుర్తించారు. మంచు కప్పేయడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటన పట్ల సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
Breaking News 🚨: Two people feared dead in a helicopter crash near Bavdhan in Pune district. More detail awaited: Pimpri Chinchwad Police official#Pune #PimpriChinchwad #Helicoptor #Helicoptorcrash #police #Bavdhan pic.twitter.com/Jk8F87tbGh
— Shino SJ (@Lonewolf8ier) October 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

