Kashmir Grenade Attack: కశ్మీర్లో గ్రేనేడ్ దాడి.. ఇద్దరు కార్మికులు మృతి
Kashmir grenade attack:దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో ఇవాళ జరిగిన గ్రేనేడ్ దాడిలో ఇద్దరు స్థానికేతర కార్మికులు మృతి చెందారు. కార్మికులు నివసిస్తున్న ప్రీ ఫాబ్రికేటెడ్ షెల్టర్‌పై హైబ్రిడ్ మిలిటెంట్ గ్రేనేడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో యూపీలోని కనూజ్కు చెందిన మోనిష్ కుమార్, రామ్ సాగర్ ప్రాణాలు కోల్పోయారు. సోఫియాన్ జిల్లా ఆస్పత్రికి వాళ్లను తరలించారు. అయితే దాడి జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి దాడికి పాల్ప
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో ఇవాళ జరిగిన గ్రేనేడ్ దాడి(Kashmir Grenade Attack)లో ఇద్దరు స్థానికేతర కార్మికులు మృతి చెందారు. కార్మికులు నివసిస్తున్న ప్రీ ఫాబ్రికేటెడ్ షెల్టర్‌పై మిలిటెంట్ గ్రేనేడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో యూపీలోని కనూజ్కు చెందిన మోనిష్ కుమార్, రామ్ సాగర్ ప్రాణాలు కోల్పోయారు. సోఫియాన్ జిల్లా ఆస్పత్రికి వాళ్లను తరలించారు. అయితే దాడి జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
లష్కరే తోయిబా సంస్థకు చెందిన హైబ్రిడ్ మిలిటెంట్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతున్నట్లు ఆఫీసర్ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కేసు బుక్ చేశారు.
శనివారం రోజున 48 ఏళ్ల కశ్మీర్ పండిట్‌ను కూడా సోఫియాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

