Uttarakhand | రూ. 14.74 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం.. ప్రారంభించిన 2 నెలలకే వరద పాలు
Uttarakhand | డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రూ. 14.74 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని రెండు నెలల క్రితం ప్రారంభించగా, నిన్న కురిసిన కుండపోత వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర నిరాశ చెందారు.
Uttarakhand | డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రూ. 14.74 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని రెండు నెలల క్రితం ప్రారంభించగా, నిన్న కురిసిన కుండపోత వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర నిరాశ చెందారు. సోలనీ నదిపై ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయడంతో.. దీని ద్వారా స్థానికులు ఇతర ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించేవారు. నాసిరకంగా పనులు చేపట్టడంతోనే బ్రిడ్జి వరదపాలైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023, ఏప్రిల్ 19వ తేదీన బ్రిడ్జిని ప్రారంభించినట్లు స్థానిక వ్యక్తి మీడియాకు తెలిపాడు.
భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌కు ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొండ చరియలు విరిగి పడుతుండడంతో అక్కడున్న ఇండ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉప్పొంగుతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇండ్లలో ఉన్న వస్తువులు వరదలో కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లో ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు.
మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రజలను కోరారు. పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

