లక్నో: హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. (Men Thrash Hospital Security Guard) అడ్డుకోబోయిన లేడీ గార్డ్‌ను పక్కకు తోసివేశారు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 128లోని జేపీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగిని కలిసేందుకు మంగళవారం ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. లిఫ్ట్‌లో పైకి చేరుకున్న వారిని అక్కడున్న సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. హాస్పిటల్ కార్డ్ లేకుండా రోగిని సందర్శించకూడదని చెప్పాడు.
కాగా, ఆగ్రహించిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆ సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారు. అతడ్ని కిందకు తోసి కొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా సెక్యూరిటీ గార్డును పక్కకు తోసేశారు. చివరకు అక్కడున్న కొందరు వ్యక్తులు జోక్యం చేసుకోవడంతో ఆ సెక్యూరిటీ గార్డును విడిచిపెట్టారు.
మరోవైపు ఆ హాస్పిటల్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన వ్యక్తులను అక్షయ్ సెహగల్, వైభవ్ సెహగల్‌గా గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
नोएडा के JP हॉस्पिटल में गुंडागर्दी का ये Video देखिए –
लिफ्ट में जाने को लेकर कहासुनी हुई तो 2 दबंग युवकों ने सिक्योरिटी गार्ड को जमीन पर गिराकर पीटा। बचाव में आई महिला गार्ड को भी नहीं बख्शा।@Jyoti_karki_ pic.twitter.com/bavqImBiqu
— Sachin Gupta (@SachinGuptaUP) September 18, 2024