terrorists cornered | పండ్ల తోటలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు.. చుట్టుముట్టిన భద్రతా దళాలు
terrorists cornered | జమ్ముకశ్మీర్‌లోని పండ్ల తోటలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కారు. భద్రతా దళాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వారిని పసిగట్టారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇద్దరు ఉగ్రవాదులు పారిపోకుండా అన్ని మార్గాలు మూసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పండ్ల తోటలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కారు. భద్రతా దళాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వారిని పసిగట్టారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇద్దరు ఉగ్రవాదులు పారిపోకుండా అన్ని మార్గాలు మూసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. (terrorists cornered) షోపియాన్ జిల్లా మీమందర్ ప్రాంతంలోని పండ్ల తోటలో లష్కర్-ఎ-తైబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు నక్కినట్లు శుక్రవారం రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా భద్రతా దళాలు పసిగట్టాయి. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాకు చెందిన జాకిర్, లతీఫ్‌గా వారిని గుర్తించారు. 2024 నుంచి నిషేధిత ఎల్ఈటీతో జాకిర్‌కు సంబంధం ఉండగా, లతీఫ్ గత ఏడాది ఆ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు భావిస్తున్నారు.
కాగా, ఆ ఇద్దరు ఉగ్రవాదులు పారిపోకుండా అన్ని మార్గాలను ఆర్మీ మూసివేసింది. సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. శనివారం వారిని సమీపిస్తున్న సైనిక బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
మరోవైపు ఆ ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే వారి కోసం ఇంకా గాలిస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఆదివారం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనగుతున్నట్లు చెప్పారు. అదనపు బలగాలను రప్పించామని, ఆ ఉగ్రవాదులు తప్పించుకునే అన్ని మార్గాలను మూసివేసినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. నాలుగు గ్రామాలను క్లియర్ చేయడంతో పాటు, మిగిలిన ప్రాంతం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- army
- Closes
- cornered
- escape routes
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament session | డీలిమిటేషన్ బిల్లు, మహిళా కోటా బిల్లుల ఆమోదానికి ప్రత్యేక పార్లమెంట్ సెషన్.. ఈ నెలలోనే
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

