Two Girls Fight In Public | మహారాష్ట్రలో ఒక కుర్రాడి కోసం ఇద్దరు బాలికలు వీధి పోరాటానికి దిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహారాష్ట్రలోని పైథాన్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. బుధవారం ఉదయం జనం రద్దీతో కూడిన జిల్లా కేంద్ర బస్టాండ్‌లో ఆ ఇద్దరు 17 ఏండ్ల బాలికలు.. సదరు కుర్రాడు తన వాడంటే తనవాడంటూ సిగపట్లకు దిగారు.
ఆ ఇద్దరు బాలికల్లో ఒకరు బుధవారం ఉదయం తన స్నేహితుడితో కలిసి బస్టాండ్‌కు చేరుకున్నది. ఈ సంగతి తెలిసిన మరో బాలిక కూడా అక్కడికి చేరుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఇద్దరూ సిగపట్లకు దిగారు. ఎంతకూ తెగక పోవడంతో సదరు కుర్రాడు.. అక్కడి నుంచి జారుకున్నాడు. ఒక కుర్రాడి కోసం కొట్లాటకు దిగిన ఆ ఇద్దరు బాలికలను పోలీసులు అరెస్ట్ చేసిన తీసుకెళ్లారు. అటుపై కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు.