చండీఘడ్: రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్(Sandeep Pathak)పై పంజాబ్ పోలీసులు ఇవాళ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎంపీ సందీప్ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. నాన్ బెయిలబుల్ నేరాన్ని ఆయనపై మోపారు. అయితే ప్రస్తుతం ఆ ఎంపీని ఇప్పట్లో అరెస్టు చేయబోరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రెండు వేర్వేరు పంజాబీ జిల్లాల్లో ఆ ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు తెలిసింది. ఎప్పుడైనా ఆయన్ను అరెస్టు చేయవచ్చు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సందీప్ పాఠక్‌తో పాటు మరో ఆరు మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆప్ ఎంపీల గ్రూపు బీజేపీలో విలీనమైంది. ఆప్ ఎంపీలు పార్టీ మారిన నేపథ్యంలో పంజాబ్ అసెంబ్లీలో శుక్రవారం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంలో సీఎం భగవంత్‌మాన్ సర్కారు నెగ్గింది. విశ్వాస పరీక్ష సమయంలో 80 మంది ఆప్ ఎమ్మెల్యేలు సభలోనే ఉన్నారు.