Viral Video | ఓ ఇద్దరు వృద్ధులు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఓ వృద్ధుడు మరో వృద్ధుడిని కింద పడేసి చితకబాదాడు. దాదాపు ఓ రెండు నిమిషాల పాటు ఇద్దరు వృద్ధుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం వృద్ధుల ఫైటింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని ఓ వీధిలో ఇద్దరు వృద్ధులు.. ఒకరు బైక్‌పై, మరొకరు స్కూటీపై వెళ్తున్నారు. ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరూ నడిరోడ్డుపై తమ ద్విచక్ర వాహనాలను ఆపారు. ఒకరికొకరు దూషించుకున్నారు. అంతలోనే ఓ పెద్దాయన మరో వృద్ధుడిపై చేయి చేసుకున్నాడు. ఆయనను కింద పడేసి కొట్టాడు. అలా ఇద్దరూ కలిసి ఓ రెండు నిమిషాల పాటు కొట్టుకున్నారు. అనంతరం ఎవరి దారినా వారు వెళ్లిపోయారు. అసలు వారిద్దరూ ఎందుకు కొట్టుకున్నారనే విషయం మాత్రం తెలియలేదు. కానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
इसे कहते है असली लड़ाई।
2 बुजुर्ग आपस में भिड़ गए।
वीडियो काफी तेजी से वायरल हो रहा है।#Maharashtra #sambhajinagar #Aurangabad #realfigting #CCTV pic.twitter.com/MfHx22UYgW
— Indrajeet chaubey (@indrajeet8080) May 20, 2023