మామ ఆశీర్వాదం తీసుకున్న చిన్న కోడలు..
Aparna yadav | ఎవరు ఆ చిన్న కోడలు అనుకుంటున్నారా..? ఆమె సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్. రెండు రోజుల క్రితం ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం మొదటిసారిగా లక్నోలోని ములాయం ఇంటికి చేరుకున్న అపర్ణ

లక్నో: ఎవరు ఆ చిన్న కోడలు అనుకుంటున్నారా..? ఆమె సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్. రెండు రోజుల క్రితం ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం మొదటిసారిగా లక్నోలోని ములాయం ఇంటికి చేరుకున్న అపర్ణ.. మామ ములాయం ఆశీర్వాదం తీసుకున్నారు. కాషాయ దళంలో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన సందర్భంగా మామ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను అని అపర్ణా యాదవ్ శుక్రవారం ఉదయం ములాయం ట్వీట్ చేశారు.
యూపీ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ దశలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి అపర్ణా యాదవ్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ఆమె భాయతీయ జనతా పార్టీలో చేరారు. కొన్నాళ్లుగా బీజేపీతో టచ్‌లో ఉన్న అపర్ణ.. ఎన్నికల సమయంలో పార్టీ మారారు. కాగా, ఎస్పీ అధినేతగా అఖిలేష్ యాదవ్ ఎంపికైన తర్వాత తిరుగుబాటు చేశారు అపర్ణ యాదవ్.. కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉన్న ఆమె.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో బీజేపీలో చేరి ఎస్పీకి షాక్ ఇచ్చారు.
भारतीय जनता पार्टी की सदस्यता लेने के पश्चात लखनऊ आने पर पिताजी/नेताजी से आशीर्वाद लिया। pic.twitter.com/AZrQvKW55U
— Aparna Yadav (@imaparnayadav) January 21, 2022
అపర్ణా యాదవ్ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నుంచి ఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో 33,796 ఓట్ల తేడాతో ఓడిపోరు. కాగా, ఈసారి జరగనున్న ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీచేయాలని ఆమె భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

